నాలాలను కబ్జా చేస్తే కూల్చివేస్తాం

నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మా ణాలు చేస్తే కూల్చివేస్తామని మేయర్‌ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం 35వ డివిజన్‌లో వార్డు బాటలో పాల్గొన్నారు. అక్రమంగా ప్రధా న కాలువ పక్కన నిర్మించిన కట్టడాలను సిబ్బంది తొలగించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో నాలాల పూడికతీత నిరంతరం కొనసాగుతుందని, బఫర్‌ జోన్‌ను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతలు తప్పవన్నారు.