బ్రెజిల్‌లో తప్పిన ఘోర ప్రమాదం:టేకాఫ్‌ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు

సావ్‌పౌలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ A320 విమానం 169 మంది ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానం క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే అందులోని ప్రయాణికులను కిందకు దించేసింది. కాసేపటికే విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది., News News, Times Now Telugu