తేయాకు కార్మికులకు భూమి ఇవ్వాల్సిందే.. లేదంటే రూ. 150 కోట్ల రాయితీలు కట్: సర్కారు సంచలన నిర్ణయం

అస్సాం0 ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ టీ తోటల యజమానులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దశాబ్దాలుగా తోటల్లో మగ్గిపోతున్న లక్షలాది మంది కార్మికులకు భూమి యాజమాన్య హక్కులు (పట్టాలు) ఇచ్చేందుకు ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సహకరించాలని కోరారు. ఒకవేళ యాజమాన్యాలు అడ్డుతగిలితే.. వారికి ప్రభుత్వం ఇచ్చే రూ. 150 కోట్ల ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నాటి బానిసత్వపు ఆనవాళ్లను తుడిచేసి, టీ కార్మికులకు ఆత్మగౌరవాన్ని అందించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. సుమారు 3.33 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా సొంతింటి కల నెరవేరనుంది.