హోంవర్క్ చేయని స్టూడెంట్.. తలకిందులుగా వేలాడదీసి శిక్ష.. క్రమశిక్షణ పేరుతో హద్దులు దాటేసిన టీచర్స్

పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గడిపే సమయం కంటే టీచర్స్ దగ్గర గడిపే సమయమే ఎక్కువ. అందుకనే పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇచ్చి ఆచార్య దేవో భవ అంటూ కీర్తించింది మన సమాజం. టీచర్స్ పిల్లల్ని తమ సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా టీచర్ వృత్తిలో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చాలా మంది టీచర్స్ కు సహనం ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే స్టూడెంట్స్ కు దారుణమైన శిక్షలు విధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి రెండు సంఘటనలు వార్తల్లో నిలిచాయి. హోమ వర్క్ చేయని ఒక స్టూడెంట్ ని తాడుతోకిటికీకి తలక్రిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన ఒకటి కాగా.. మరొకటి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్న పిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టడం. ఈ దారుణ సంఘటనలు హర్యానా రాష్ట్రంలో పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్ లో జరిగినట్లు తెలుస్తోంది.