Investments in AP: ఏపీలోని ఆ జిల్లాకు మంచి రోజులు.. టాటా కంపెనీ రూ.6675 కోట్ల పెట్టుబడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ రూ.6675 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 10 గిగావాట్ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా.. దేశీయంగా సౌర పరికరాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేయి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.