kumaram bheem asifabad- మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరా నాణ్యత, సేవల పరంగా మరింత మెరుగు పర్చాలన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. దహెగాం నుంచి బెల్లంపల్లి డివిజన్‌లోని కన్నెపల్లి మధ్యలోని 20 కిలోమీటర్ల ఇంటర్‌లింకింగ్‌ లైన్‌ పనులను పరిశీలించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు