కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మ నిచ్చాడు...ఆలయం ఎవరి సొత్తు కాదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా కొలుస్తామని అన్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఒక పార్టీకి కాకుండాతెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు., News News, Times Now Telugu