కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని...పోలీసు పహారాలోనే గులాబీదళపతి: సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధినేతగా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా, శాసన సభ్యుడిగా ఇప్పటి వరకు కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే శాసన సభ్యుడిగా మాత్రం జీతభత్యాలు తీసుకుంటూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. 1 డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు రూ.57 లక్షల 84వేల 124 రూపాయలు జీతం రూపంలో కేసీఆర్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి రారు కానీ జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు., News News, Times Now Telugu