"నిరసనకారులను చంపితే ఊరుకోం.. తీవ్రంగా దెబ్బకొడతాం": ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

ఇరాన్‌ను కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చిచ్చు రాజేస్తోంది. తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సామాన్య నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. మీరు నిరసనకారులను చంపడం మొదలుపెడితే.. మేం మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెహ్రాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.