మన్యంలోని వారపు సంతలే గిరిజనానికి సూపర్ మార్కెట్లుగా అవసరాలు తీర్చుతున్నాయి. పల్లెల్లో జనం తమ నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు వారపు సంతలనే ఆశ్రయిస్తారు. ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో సంతలు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లోనే గిరిజనుల వ్యవసాయ, అటవీ ఫలసాయం చేతికి వస్తుంది. వాటిని సంతల్లో విక్రయించి, వచ్చిన డబ్బులతో సరుకులన్నీ కొనుగోలు చేసుకుంటారు.