అరేబియా సముద్రంపై పాకిస్తాన్ కన్ను.. అమెరికా సాయం.. ట్రంప్‌తో షెహబాజ్, అసిమ్ మునీర్ భేటీ

అరేబియా సముద్రంపై పాకిస్తాన్ కన్నేసింది. అక్కడ పోర్టు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం అమెరికా సాయం కోరుతున్నట్లు సమాచారం. ఇటీవల ట్రంప్‌తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లు భేటీ.. ఈ పోర్టు నిర్మాణం కోసమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పాక్‌లో దొరికే కీలకమైన ఖనిజాలను రవాణా చేసేందుకు ఈ పోర్టును ఉపయోగించుకోవాలని పాక్‌ ఆలోచిస్తోంది. అయితే ఆ పోర్టును అమెరికా తన సైనిక స్థావరాల కోసం వినియోగించడాన్ని పాక్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఇక ఈ ప్రతిపాదనల గురించి.. రెండు దేశాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.