గోవా అగ్నిప్రమాదం కేసులో హైడ్రామా.. వెన్నునొప్పి నాటకమాడిన సహ యజమాని, పోలీసులు ఎలా గుర్తించారంటే?

గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో 25 మందిని బలిగొన్న అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నైట్‌క్లబ్ కో-ఓనర్లలో ఒకరైన అజయ్ గుప్తా.. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో నకిలీ వెన్నునొప్పి సమస్య పేరుతో అడ్మిట్ అయ్యారు. అయితే గుప్తా ప్లాన్‌ను భగ్నం చేసిన ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుప్తా భాగస్వాములైన లూత్రా సోదరులు ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోగా.. వారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.