పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముఖ్య కారణం ఇదే.. ఎట్టకేలకు రివీల్ చేసిన మంత్రి సీతక్క..

తెలంగాణలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు నేరుగా అందాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల లక్ష్యం కోసం ప్రభుత్వం పోరాడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయని పనిని, కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను అందించి చూపిందని వివరించారు. ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు ప్రచారం చేసేవారిని సహించేది లేదని, స్థానిక సంస్థల బలోపేతమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు.