kumaram bheem asifabad- నేడు మూడో విడత పల్లె పోరు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మూడో విడత బుధవారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్‌నగర్‌ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్‌ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్‌ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగటం లేదు. దీంతో బుధవారం 104 సర్పంచ్‌, 744 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.