kumaram bheem asifabad- భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి

జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్‌ గ్రామంలో జరుగనున్న జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్‌ గ్రామంలోని బుధవారం బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో గల కార్యనిర్వహక అధికారి కార్యాలయంలో జాతర మహోత్సవ నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జిల్లా ఎస్‌పీ నితికా పంత్‌, అదనపు ఎస్‌పీ చిత్తరంజన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, దేవాలయ శాఖ అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.