మళ్లీ ఇందిరమ్మ చీరల పంపిణీ షురూ.. ఆధార్ కార్డు ఉంటే చాలు..

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 15 లక్షల మందికి సంక్రాంతిలోపు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి కూడా ఈ చీరలను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, కోటి మందికి చీరలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా మంత్రి సీతక్క తెలిపారు.