YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం..

అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీకి రాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని ఎథిక్స్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభకు రాని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి.. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. వివరణ తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం రోజున ఎథిక్స్ కమిటీ భేటీయై ఈ అంశంపై చర్చించింది.