ఎంత ఘోరం.. నిద్రిస్తున్న తల్లిదండ్రుల మధ్య నలిగి ప్రాణాలు విడిచిన 26 రోజుల పసికందు

ఉత్తర ప్రదేశ్‌లోని సిహాలి జాగీర్‌ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కేవలం 26 రోజుల నవజాత శిశువును.. గత శనివారం రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రుల మధ్యలో పడుకోబెట్టుకున్నారు. ఈక్రమంలోనే అమ్మా, నాన్నలు నిద్రలో కదలగా.. చిన్నారి ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. శ్వాస సమస్య, కామెర్ల నుంచి కోలుకుని.. బిడ్డకు పేరు కూడా పెట్టిన ఆ దంపతులు సంతోషంగా ఉన్న సమయంలో ఈ అనుకోని ప్రమాదం వారి జీవితంలో చీకటిని నింపింది. ఆదివారం ఉదయం బిడ్డలో కదలిక లేకపోవడంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో అందరినీ కంటతడి పెట్టించింది.