దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలుపుతాం... ప్రతీ కుటుంబంలో ఏఐ ప్రొఫషనల్: మంత్రి నారా లోకేశ్

దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఅగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భవిష్యత్ లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 15 శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించాం. ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను ఏర్పాటుచేస్తాం. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం ఏపీ నుంచే వస్తోంది. దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయి. వచ్చే 24 నెలల్లో దీనిని 70శాతానికి తీసుకెళ్తాం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు., News News, Times Now Telugu