ఇంజిన్ ఫెయిలై రోడ్డుపై దిగిన విమానం.. ఏకంగా కారును ఢీకొట్టి.. వీడియో వైరల్

ఫ్లోరిడాలో సోమవారం రాత్రి జరిగిన అత్యంత అసాధారణ ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటర్‌స్టేట్-95 (ఐ-95) జాతీయ రహదారిపై సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా క్రాష్ ల్యాండింగ్ అయిన ఓ చిన్న విమానం.. వేగంగా వెళ్తున్న టయోటా కామ్రీ కారును బలంగా ఢీకొట్టింది. విమానం నేలపై దిగుతూ కారును వెనుక నుంచి ఢీకొట్టిన దృశ్యాలు రికార్డయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న 57 ఏళ్ల మహిళ స్వల్ప గాయాలతో బయటపడగా.. విమానంలోని పైలట్, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.