ధ్వని కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక క్షిపణితో ఉక్రెయిన్‌పై రష్యా దాడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ఓ వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 20 అంశాల శాంతి ప్రణాళిక దాదాపు ఖరారయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ తీవ్రమవుతోంది. మాస్కో అధ్యక్ష నివాసంపై డ్రోన్ దాడులకు ప్రతీకారంగా, రష్యా అత్యాధునిక ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఈ దాడిలో కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, నలుగురు మరణించారని, 22 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. ఇది ఐరోపా భద్రతకు పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది.