పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోదల్చుకోవడం లేదు: రేవంత్ రెడ్డి

మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో ‘సుజెన్ మెడికేర్’ పరిశ్రమను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పక్క రాష్ట్రాలతో జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తూ.. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. సముద్ర తీరం లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం కల్పించేలా 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మద్దతు అడిగారు.