పఠాన్‌కోట్‌లో షాకింగ్ ఘటన.. ISI ఉచ్చులో 15 ఏళ్ల బాలుడు.. దేశ రహస్యాలు చేరవేస్తూ అరెస్ట్

దేశ భద్రతా కోటను బద్దలు కొట్టేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కొత్త పంథాను ఎంచుకుంది. ఆయుధాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా సామాన్యులనే డిజిటల్ ఆయుధాలుగా మలుచుకుంటోంది. కేవలం 24 గంటల వ్యవధిలో పంజాబ్, హర్యానాల్లో వెలుగుచూసిన రెండు స్పైయింగ్ కేసులు దేశ భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. పఠాన్‌కోట్‌లో తండ్రి మరణంపై ఉన్న భావోద్వేగాన్ని ఆసరాగా చేసుకుని ఒక 15 ఏళ్ల మైనర్ బాలుడిని ఐఎస్‌ఐ లోబర్చుకోగా, అంబాలాలో ఏకంగా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పనిచేసే కాంట్రాక్టరే శత్రు దేశానికి రహస్యాలు చేరవేస్తూ పట్టుబడటం కలకలం రేపుతోంది.