మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు.. నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ..

తెలంగాణ మంత్రి సీతక్కకు ఏఐసీసీ (AICC) జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతను అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ.. నిధుల్లో కోత విధిస్తోందని విమర్శిస్తున్న కాంగ్రెస్, ఆ పథక పరిరక్షణ కోసం ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ అనే జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల హైపవర్ సమన్వయ కమిటీలో సీతక్కకు చోటు కల్పించారు. గ్రామీణ పేదలు.. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని కూలీల సమస్యలపై సీతక్కకు ఉన్న క్షేత్రస్థాయి అవగాహనను గుర్తించిన అధిష్ఠానం.. ఆమెను ఈ జాతీయ కమిటీలోకి తీసుకుంది. తెలంగాణ నుంచి ఈ కమిటీలో ఉన్న ఏకైక నాయకురాలు ఆమె కావడం విశేషం.