మెరిట్ ఉంటే రిజర్వ్‌డ్ అభ్యర్థులూ జనరల్ కోటాలోకే: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

దేశంలో ఉద్యోగ నియామకాల్లో మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న సందిగ్ధతకు సుప్రీం కోర్టు ఒక స్పష్టమైన ముగింపును ఇచ్చింది. ఓపెన్ కేటగిరీ అనేది అగ్రవర్ణాల కోటా కాదు.. అది ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంచే ఒక స్వేచ్ఛా క్షేత్రం అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజస్థాన్ హైకోర్టు నియామక ప్రక్రియలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరిస్తూ.. ఒక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థి జనరల్ అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే, అతడిని మెరిట్ జాబితాలో అగ్రస్థానంలోనే ఉంచాలని, కేవలం అతని సామాజిక వర్గాన్ని బట్టి రిజర్వేషన్ కోటాకు పరిమితం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.