సోనియా గాంధీకి అనారోగ్యం.. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి ఎలా ఉందంటే?

దేశ రాజధానిలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమె.. సోమవారం రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసు కల్గిన సోనియా గాంధీ.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు ప్రముఖ చెస్ట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.