'కోళ్లు, మేకలకు ప్రాణం ఉండదా? కేవలం కుక్కల కోసమేనా ఆవేదన?': సుప్రీం కోర్టు ఘాటు ప్రశ్న

దేశవ్యాప్తంగా సామాన్యులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వీధి కుక్కల బెడదపై సుప్రీం కోర్టులో బుధవారం సంచలన వాదనలు జరిగాయి. జంతువుల మీద మీకు ఉన్న ప్రేమ కేవలం కుక్కలకే పరిమితమా? కోళ్లు, మేకలకు ప్రాణాలు ఉండవా? అంటూ జంతు సంరక్షణ సంఘాలను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. కుక్క కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వృద్ధులు, చిన్నారుల తండ్రుల ఆవేదనతో కోర్టు హాలు దద్దరిల్లిపోగా.. మరోవైపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వంటి వారు కుక్కల హక్కుల కోసం గట్టిగా వాదించారు.