తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. ఆ సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలంటున్న యూట్యూబర్స్..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ఎదుట జరిగిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పలువురు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరణం వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని.. బీసీ ఉద్యమంతో ముడిపెడుతున్న తీరుపై విచారణ చేపట్టాలని కోరారు. ముఖ్యంగా.. మల్లన్న ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమపై మల్లన్న చేస్తున్న తప్పుడు ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.