తిరుపతమ్మ రంగుల ఉత్సవానికి వేళాయె

శ్రీతిరుపతమ్మ రంగుల ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను సోమవారం ఉదయం 6.11 గంటలకు బయటకు తీసేందుకు ఆలయ అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. అక్కడి నుంచి రజకులు విగ్రహాలను తలపై పెట్టుకొని గ్రామంలోని రంగుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. రాత్రికి ఎంపిక చేసిన ఎడ్లబండ్లపై విగ్రహాలను ఉంచి వేడుకగా జగ్గయ్యపేటకు తీసుకువెళ్లనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా సీపీ రాజశేఖర బాబు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్త్‌ కల్పిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ లక్ష్మీశ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.