నేను చనిపోతాననిపిస్తోంది, మా ఫ్యామిలీకి చెప్పండి: సిడ్నీ రియల్ హీరో చివరిమాటలివే..

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి అయిన అహ్మద్‌.. తుపాకీ కాల్పుల మధ్య ఉగ్రవాదిని ధైర్యంగా అడ్డుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పోరాటం మధ్యలో ఆయన తన బంధువుతో.. నేను చనిపోతున్నా. నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు అని పంపిన చివరి సందేశం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు.