kumaram bheem asifabad- కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ యాదవ్‌రావ్‌ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో మార్లవాయిలో కమ్యూనిటీ భవనం, తాగునీరు, గుస్సాడీ భనవం, డార్ఫ్‌ రీడింగ్‌ రూం, పద్మశ్రీ గుస్సాడీ రాజుకు ఆసిఫాబాద్‌లో గృహం మంజూర అయిందని చెప్పారు. వాటి కోసం సుమారు 20 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మార్లవాయి అభివృద్ధి జరుగలేదని కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్పారు