కరోనా డ్యూటీలో మరణించిన ప్రైవేట్ వైద్యలకూ రూ.50 లక్షల బీమా పథకం: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన ప్రైవేట్ డాక్టర్లు, ఆరోగ్య నిపుణులకు భారీ ఊరట లభించింది. వారి సేవలను అధికారికంగా రిక్విజేషన్ చేయలేదనే సాంకేతిక కారణంతో రూ.50 లక్షల కేంద్ర బీమా పథకం (PMGKY) నుంచి మినహాయించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. డాక్టర్ బి.ఎస్. సర్గాడే భార్య వేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం.. ముందుండి పోరాడిన వైద్య నిపుణులను హీరోలుగా కొనియాడింది. ఏదేమైనా బాధితులు లబ్ధి పొందాలనుకుంటే.. మరణం కొవిడ్ విధి నిర్వహణలోనే జరిగిందనే విశ్వసనీయ ఆధారాలను క్లెయిమ్ దారులు తప్పనిసరిగా సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.