దేశంలో చాలా మందికి తాగడానికే నీళ్లే లేవు.. మీకు క్వాలిటీ బాటిళ్లు కావాలా? సుప్రీంకోర్టు ఆగ్రహం

వాటర్ బాటిళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం లేదని, ఎఫ్ఎస్ఎస్ఎల్ నిబంధనలను అందుకు అనుగుణంగా సవరించాలని సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో చాలా మందికి కనీస తాగునీరు కూడా అందడం లేదని, ఇలాంటి సమయంలో బాటిళ్ల నాణ్యతపై పిటిషన్లు లగ్జరీ వ్యాజ్యాలు అని వ్యాఖ్యానించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భూగర్భజలాలపై ఆధారపడుతున్నారని, పట్టణ-కేంద్రీకృత విధానం సరికాదని కోర్టు పేర్కొంది.