వికీలీక్స్ వ్యవస్థాపకుడిని విడిపించిన లాయరే మదురోకు అండగా.. ఈ కేసు కూడా గెలుస్తారా?

అంతర్జాతీయ న్యాయ చరిత్రలోనే అత్యంత అరుదైన, ఉత్కంఠభరితమైన ఘట్టం అమెరికాలోని మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టులో ఆవిష్కృతమైంది. వెనిజులా గడ్డపై అమెరికా జరిపిన మెరుపు దాడిలో చిక్కిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఇప్పుడు అగ్రరాజ్యం ముందు ఖైదీగా నిలబడ్డారు. అయితే ఈ కేసులో నిందితుడి హోదా కంటే.. న్యాయపీఠంపై కూర్చున్న వ్యక్తి, కక్షిదారుడి తరఫున వాదిస్తున్న వ్యక్తి వివరాలే ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 92 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో, అల్‌ఖైదా ఉగ్రదాడుల నుంచి ట్రంప్ కేసుల వరకు ఎన్నో సంచలనాలు చూసిన జడ్జి అల్విన్‌ హెల్లర్‌స్టీన్‌ ఈ విచారణను చేపడుతుండగా.. మరోవైపు వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అసాధ్యమైన రీతిలో జైలు నుంచి విడిపించిన లీగల్ మాస్టర్ మైండ్ బారీ పొలాక్ మదురో తరఫున రంగంలోకి దిగారు.