గిరిపుత్రుల తలరాతలు మార్చే కంటైనర్ పాఠశాలలు వచ్చేశాయ్.. చిన్నారుల కేరింతలు!

జిల్లా కేంద్రంలోనే ఉన్నా అక్షర జ్ఞానానికి నోచుకోని గిరిపుత్రులకు నాలుగు అక్షరాలు నేర్పాలనే తాపత్రయం ఫలించింది. వివాదస్పద స్థలంగా కొనసాగుతున్న చోట శాశ్వత పాఠశాల నిర్మాణానికి ఆంక్షలు అడ్డురావడంతో కంటైనర్ రూపంలో పాఠశాల ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లు చెట్టు నీడే పాఠశాలగా.. పూరి పాకే బడిగా సాగిన చోట అందమైన పాఠశాల గది ఏర్పాటవడం ఆ గిరిజన బిడ్డల మోముల్లో ఆనందాన్ని నింపింది. ITDA సహకారంతో జిల్లా‌ కలెక్టర్ చొరవతో గిరు పుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు సక్సెస్ అవడంతో అడవుల జిల్లా మురిసిపోతోంది. ఆ కంటైనర్ ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలేంటో మనం కూడా చూసొద్దం రండి..