ఏపీ విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోంది..! ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

విద్యాశాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ఉన్నతాధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ (పీడీ)పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 4న పీడీ కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పార్ట్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న వారు.. తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.