kumaram bheem asifabad- జనరేటర్‌ లేక అవస్థలు

కౌటాల ప్రభుత్వ ఆసుపత్రిలో చీకట్లోనే చికిత్సలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన లవకుష్‌ మంగళవారం తన చేనులో సాయంత్రం క్రషర్‌ పడుతున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి లవకుష్‌ను కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్‌ పవన్‌కల్యాణ్‌ ఇంజక్ష న్‌ ఇచ్చి చికిత్సలు నిర్వహించారు. అదే సమయంలో చింతలమానేపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన గర్భిణీ సునీత పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా వారికి సైతం డాక్టర్‌ చికిత్సలు కాన్పు చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో కరెంటు పోవడంతో ఇరువురికి సైతం డాక్టర్‌ సెల్‌ఫోన్‌ లైట్ల సహాయంతో చికిత్స అందించారు