వార్నీ.. ఏడేళ్లుగా కలెక్టర్‌గా చెలామణి అవుతున్న వ్యక్తి, తండ్రికి నిజం చెప్పలేకే ఈ నాటకం.. చివరకు?

సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించలేకపోయాననే నిజాన్ని కుటుంబానికి చెప్పలేక, ఏకంగా ఒక నకిలీ ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తాడు రాజేష్ కుమార్ అనే యువకుడు. నాలుగు సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి విఫలమైనా.. తండ్రి కలను నెరవేర్చాననే భ్రమలో బంధువులను, సమాజాన్ని ఏడేళ్ల పాటు బురిడీ కొట్టించాడు. ఐఏఎస్ కేడర్ అధికారిని అని చెప్పుకుంటూ ఊరేగిన ఈ నకిలీ కిలాడీ.. చివరకు ఒక భూ వివాదం సెటిల్ చేసేందుకు తన అధికారిక దర్పాన్ని పోలీస్ స్టేషన్‌లో ప్రదర్శించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసుల విచారణలో తన అబద్ధాల కోట కూలిపోవడంతో.. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.