గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. వారి సబ్సిడీ నిలిపివేత.. కారణం ఇదే..

గ్యాస్ వినియోగదారులు తమ ఈ కేవైసీ (e KYC) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని నేరుగా అర్హులైన వారికే అందించడం, నకిలీ కనెక్షన్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతాలో పడే రాయితీ డబ్బులు నిలిచిపోవడంతో పాటు సిలిండర్ బుకింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధారణ కనెక్షన్ ఉన్నవారు , ఉజ్వల పథకం లబ్ధిదారులు ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. గ్యాస్ డెలివరీ ఇచ్చే వ్యక్తి వద్ద బయోమెట్రిక్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా కేవైసీ చేసుకునే అవకాశం ఉంది.