మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీ పొత్తు.. శివసేనకు షాకిచ్చారనుకుంటే హస్తానికే హ్యాండ్

మహారాష్ట్ర రాజకీయాల్లో సిద్ధాంతాలను పక్కనబెట్టి అధికారం కోసం సాగుతున్న ఎత్తుగడలు మరో కీలక మలుపు తిరిగాయి. అంబర్‌నాథ్ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన మరుక్షణమే.. ఆ 12 మంది కౌన్సిలర్లు సామూహికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ సమక్షంలో జరిగిన ఈ చేరికతో అంబర్‌నాథ్‌లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.