ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహిత.. ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ మాధవ్ గాడ్గిల్ (83) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పుణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు గురువారం వెల్లడించాయి.