వెనిజులాలో మరోసారి ఉద్రిక్తత: అధ్యక్ష భవనం వద్ద కాల్పులు... కొత్త ప్రెసిడెంట్ ప్రమాణం చేసిన గంటల్లోనే!

వెనిజులాలో రాజకీయ సంక్షోభం గంట గంటకూ రసవత్తరంగా మారుతోంది. అమెరికా డెల్టా ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో అధ్యక్షుడు నికోలస్ మదురో చిక్కిన కొద్ది రోజుల్లోనే.. ఆ దేశ రాజధాని కరాకాస్‌లో మరోసారి తుపాకీ గర్జన వినిపించింది. మదురో సన్నిహితురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే.. అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్ సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. భవనంపై అనుమానాస్పద డ్రోన్లు ఎగరడం.. వాటిని కూల్చేందుకు భద్రతా దళాలు ఆకాశంలోకి తూటాలు పేల్చడం వంటి దృశ్యాలు ఆ దేశంలో గందరగోళ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.